అక్కన్నపేటలో ఎల్‌నినోపై రైతులకు అవగాహన..

  • ఆరుతడి పంటల సాగుకు సూచనలు
  • వ్యవసాయ విస్తరణ అధికారి సబీహ 

విశ్వంభర, అక్కన్నపేట:  అక్కన్నపేట గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి సబీహా ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం, ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జ, వేరుశెనగ వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.అలాగే తక్కువ కాల వ్యవధి గల పంట రకాలను ఎంపిక చేసుకోవడం, నేలలో తేమను సంరక్షించే పద్ధతులు పాటించడం, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సలహాల మేరకు సాగు పనులు చేపట్టాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం, ఆరుతడి పంటల సాగుపై రైతుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జన్నారపు సంపత్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మహేష్, రైతులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/farmers-awareness-of-el-nino-in-akkannapet/article-19250

Tags: