జేఎన్టీయూ రిజిస్ట్రార్ ను కలిసిన విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీ
విశ్వంభర, రామన్నపేట: హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ.జయలక్ష్మిని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ అశోక్ ఆద్వర్యంలో కలిసి విశ్వవిద్యాలయాలలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అదే విధంగా దివ్యాంగులకు మౌలిక వసతులు కల్పించాలని, 2016 చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని దివ్యాంగులకు ఫీజులలో రాయితీలు కల్పించాలని, డిజేబుల్ సెల్ ఏర్పాటు చేయాలని, దివ్యాంగులకు అన్ని విభాగాలలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఇటీవల విడుదల చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియామకంలో దివ్యాంగులకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఉద్యోగాలలో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రిజిస్ట్రార్ స్పందిస్తూ కొన్ని రోజుల సమయంలో మీ సమస్యలు పరిష్కారం చేస్తామని, ఈ విషయం వైస్-చాన్స్లర్ దృష్టికి తీసుకుపోయి దివ్యాంగులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల పురం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దొరపల్లి దానమ్మ, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర సభ్యులు ఆంజనేయులు కురుమ తదితరులు పాల్గొన్నారు.