ప్రతి వ్యక్తి తమ పేరును ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి
- : మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ రాములు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజ పుల్లారెడ్డి
విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని జాఫర్ పల్లి, ఖుదావంద్పూర్, రావులపల్లి గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రాములు, మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ బద్రి గారి రాజ పుల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి వ్యక్తి తమ పేరును ఓటర్ లిస్టులో నమోదు అయ్యేవిధంగా ఆయా గ్రామాల్లోని బి ఎల్ ఎ, బి ఎల్ వో లు దగ్గరుండి చేయించాలని తెలిపారు. ఎస్ ఐ ఆర్ ఫామ్ లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. ఓటర్ లిస్టులో ఓటర్ పేరు నమోదు కావాలంటే బీఎల్ఏ లు పూర్తి సహాయ సహకారాలు అందించినప్పుడే 100 శాతం ఓటర్ నమోదు కార్యక్రమం పూర్తి కావడం జరుగుతుందని పేర్కొన్నారు. బి ఎల్ ఏ ల బాధ్యత ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాఫర్ పల్లి సర్పంచ్ మహేష్, కార్యదర్శి స్వరూప,కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్, బి ఎల్ ఎ నాగవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.