వీరరఘు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం

విశ్వంభల , గుండాల : గుండాల మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ అనంతారం హిందీ ఉపాధ్యాయులు వీరరఘు  భౌతికకాయానికి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అగ్గిరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  పునర్వసు, పి ఆర్ టి యు గుండాల మండల అధ్యక్షుడు జంపాల రాజు, ప్రధాన కార్యదర్శి గొడుగు బాలరాజు, కార్యదర్శి కూరెల్ల రవి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు గవ్వల అమరేందర్, రాఘవేందర్, రాజశేఖర్ రెడ్డి, సీఆర్‌పీ బసవలింగం, ఎంఐఎస్ నరేష్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జిహెచ్ఎం పునర్వసు  వీరరఘు  కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే కుటుంబానికి అండగా నిలుస్తూ అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, వీరరఘు విద్యార్థుల పట్ల అంకితభావంతో పనిచేసిన ఆదర్శ ఉపాధ్యాయులని కొనియాడారు. ఆయన మరణం విద్యాశాఖకు తీరని లోటని పేర్కొంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-of-rs-30-thousand-to-veeraraghu-family/article-19275

Tags: