నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు
విశ్వంభర, మహబూబాబాద్ : వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ , నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల డోర్నకల్ మండలంలోని తెల్లబండ తండా, గ్రామంలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, డిటిఎఫ్ , వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ టీంలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 10 మంది పై కేసు నమోదు చేసి, 48 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని, చక్కెర పానకం ధ్వంసం చేయడం జరిగింది. గతంలో రెండుసార్లు సారాయి అమ్ముతూ పట్టుబడి మరలా సారాయి తయారు చేస్తూ పట్టుబడినటువంటి జరుపుల బావు సింగ్ ను అరెస్టు చేసి మహబూబాబాద్ జె ఎఫ్ సి ఎం జడ్జి ముందు ప్రవేశపెట్టగా అతనికి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఈ దాడులలో ఎక్సైజ్ సిఐలు చిరంజీవి, .నాగయ్య, . నాగేశ్వరరావు , నీరజ,చంద్రశేఖర్ మరియు ఎక్సైజ్ ఎస్సై లు కిరీటి, మౌనిక,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, బుచ్చయ్య కానిస్టేబుల్ లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు,సంపూర్ణ , గోపి , బలరాం, రియాజ్ , ఇతర సిబ్బంది పాల్గొన్నారు