సిద్ధాపూర్ డంపింగ్ యార్డు జీవో 641 రద్దు చేయాలి
- జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్
విశ్వంభర, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 641ను వెంటనే రద్దు చేయాలని సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. షాద్‌నగర్‌లోని దేవి గ్రాండ్ హోటల్‌లో మంగళవారం కమిటీ తొలి సమావేశం చైర్మన్ రాంబాల్ నాయక్ అధ్యక్షతన జరిగింది. డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రభావిత గ్రామాలు, మండలాల్లో కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాంబాల్ నాయక్ మాట్లాడుతూ, డంపింగ్ యార్డు ఏర్పాటుతో సిద్ధాపూర్‌తో పాటు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు కాలుష్యం, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం, పర్యావరణం, ప్రజల జీవన విధానానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొంటూ, జీవో 641ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ సలహాదారులు వంగూరి గంగిరెడ్డి, అబ్దుల్ రబ్ జామీ, వర్కింగ్ చైర్మన్ దొడ్డి శ్రీనివాస్, కన్వీనర్ పినపాక ప్రభాకర్, వివిధ రాజకీయ, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.