విద్యార్థులపై లాఠీచార్జీని ఖండించిన ఆప్
- విద్యార్థులపై లాఠీచార్జీని ఖండించిన ఆప్
విశ్వంభర, ఖైరతాబాదు : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జీని ఖండిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదు నెక్లెస్ రోడ్డులోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు మాట్లాడుతూ, శాంతియుత నిరసన హక్కును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులపై బలప్రయోగం ఖండనీయమని, దాడికి బాధ్యులపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ముక్తాతిరు, పరీక్షన్ రాజ్, దర్శనం రమేష్, రాకేష్ రెడ్డి, లక్ష్మణ్, అనుదీప్, కుమార్ యాదవ్, సనోద్ యాదవ్, జావేద్, రహమాన్ షరీఫ్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.