నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కార్తీక్‌కు ఘన సన్మానం
విశ్వంభర, చింతపల్లి: గ్రామానికి చెందిన విగ్రహాల శ్రీనాథ్ కుమారుడు విగ్రహల కార్తీక్ ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షలో 438 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మంగళవారం చింతపల్లి గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత కార్తీక్‌ను అభినందిస్తూ, ఆయన సాధించిన విజయం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్తీక్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని గ్రామ పాలక వర్గం సూచించింది. ఈ కార్యక్రమంలో చింతపల్లి గ్రామ సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, ఉప సర్పంచ్ రెహనా సిద్ధిక్ బాబా, పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డు మెంబర్లు వందనపు ఆంజనేయులు, చెట్లపల్లి స్వాతి హరిప్రసాద్, గునుకుల మౌనిక నరేష్, ఎండి అబ్బాస్, ఎండి జాఫర్, సిద్దే స్వామి, బిఎల్వోలు గోవిందు అంజలి, శీలం మేఘమాల, సుంకోజు పద్మ, విగ్రహాల మన్మధ చారి, కారోబార్ ముంతాజ్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.