సరస్వతీ శుభోదయం స్కూల్‌లో ఘనంగా రైన్ డే వేడుకలు

విశ్వంభర,  తంగళ్ళపల్లి :  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శుభోదయం ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మంగళవారం రైన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, వర్షాలు ప్రకృతికి వరమని, రైతులకు పంటల సాగుకు, చెరువులు, కుంటలు నిండటానికి, భూగర్భ జలాల పెరుగుదలకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా రైన్‌కోట్ ఉపయోగించాలని, పిల్లలు మట్టిలో ఆడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని రైన్ డే ప్రాముఖ్యతను తెలియజేశారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rain-day-celebrations-at-saraswati-subhodayam-school/article-19340

Tags: