ఎల్‌ఐసీ ఏజెంట్లకు స్వంత భవనం కోసం ప్రభుత్వ స్థలం కేటాయింపునకు కృషి చేస్తా
- టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హామీ
విశ్వంభర, హైదరాబాద్: భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ–1964) సికింద్రాబాద్ డివిజనల్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని సీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన సుమారు 1,200 మంది ఎల్‌ఐసీ ఏజెంట్లు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఎల్‌ఐసీ అభివృద్ధిలో ఏజెంట్ల పాత్ర కీలకమని కొనియాడారు. సికింద్రాబాద్ డివిజనల్ కౌన్సిల్‌కు స్వంత కార్యాలయ భవనం నిర్మాణం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలం కేటాయించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎస్.బి. శ్రీనివాసాచారి మాట్లాడుతూ, సికింద్రాబాద్ డివిజన్ యూనియన్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, మారుతున్న పరిస్థితుల్లో ఏజెంట్లు మరింత ఐక్యంగా ఉండాలని సూచించారు. లియాఫీ జాతీయ నాయకుడు కౌటికె విఠల్ మాట్లాడుతూ, ఏజెంట్ల కమిషన్ పరిరక్షణతో పాటు వృత్తిపరమైన శిక్షణ, చట్టపరమైన రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. సికింద్రాబాద్ డివిజన్‌కు స్వంత భవనం నిర్మాణానికి తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మూడేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రామస్వామి అధ్యక్షుడిగా, గోవింద్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, భాస్కర్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో లియాఫీ జాతీయ, జోనల్, డివిజనల్ నాయకులు, ఎల్‌ఐసీ అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు.