కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  వెంటనే రాజీనామా చేయాలి

 : సిపిఎం డిమాండ్

 విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల విలేకరుల సమావేశంలో నీటి పరీక్ష పేపర్ల లీకేజీ పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ఢిల్లీ జంతర్మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పాశవీకంగా దాడి చేస్తూ బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు, ప్రయోగిస్తూ దాడి చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా వలిగొండ మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ, నీటి పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 19 సార్లు పరీక్ష పత్రాలు లీకయాయని దీన్ని బట్టి చూస్తే కేంద్ర బిజెపి ప్రభుత్వం విద్యారంగం పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని అర్థం చేసుకోవచ్చన్నారు నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మనస్థాపంతో 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని విద్యార్థి కుటుంబాలకు  కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నీటి కుంభకోణంపై సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి ఉద్యమకారులపై  బాష్పవాయు  గోళాలు ప్రయోగించడం, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను అర్థం చేసుకోవచ్చని ఇప్పటికైనా వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, మెరుగు వెంకటేశం, మండల కమిటీ సభ్యులు కొండె క్రిష్టయ్య,పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ,నాయకులు శీలం ఇందిర,కర్నాటి మత్యారాణి, కొండూరు సత్తయ్య వేముల లక్ష్మయ్య,ద్యానబోయిన యాదగిరి, చేగూరి నరసింహ,పెద్దబోయిన భీమరాజు,రమేష్, తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/union-education-minister-dharmendra-pradhan/article-19334

Tags: