ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
విశ్వంభర, సంగారెడ్డి : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని , బూత్ లెవెల్ ఏజెంట్లు అలసత్వం ప్రదర్శించకుండా శాతం వంద లక్ష్యంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గానికి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ మండలాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేసి, నమోదు కాని అర్హులైన ఓటర్లను గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాలు పూరించడంలో సహాయం చేయాలని సూచించారు. బూత్‌ల వారీగా రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకుని గడువులోగా ప్రక్రియను పూర్తి చేసి, ఫారాలను బూత్ లెవెల్ అధికారులకు అందించాలని తెలిపారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా ఓటర్లలో అవగాహన పెంచాలని బూత్ లెవెల్ ఏజెంట్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డాక్టర్స్ సెల్ చైర్మన్ డా. రాజీవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లోడి సతీష్, బాలాజీ నరసింహులు, దుర్గారెడ్డి, దశరథ్, రమేష్ జోషి, శివరాజ్, శేషారెడ్డి, దిగంబర్ రావు, రమేష్, మాజీ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.