స్వచ్ఛ భారత్, జలసిరి పనులు వేగవంతం చేయాలి
- మరుగుదొడ్లు, జల సంరక్షణ పనులపై అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
విశ్వంభర, సూర్యాపేట: జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్, జలసిరి, ఎల్‌నినో పరిస్థితులు, వ్యవసాయ సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వెబ్‌ఎక్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జల సంరక్షణ, తాగునీటి సదుపాయాలు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని, మరుగుదొడ్డి లేని అర్హులైన ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ, నాన్-ఇందిరమ్మ గృహాలకు సంబంధించిన ప్రతిపాదనలను విడివిడిగా పంపాలని, మంజూరైన మరుగుదొడ్ల ఫొటోలను స్వచ్ఛ భారత్ మిషన్ యాప్‌లో అప్‌లోడ్ చేసి లబ్ధిదారులకు నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జలసిరి, తాగునీరు, జల సంరక్షణ పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఇంకుడు గుంతలు, బోరుబావుల పునరుద్ధరణ, ఇంటి పైకప్పులపై వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, వ్యవసాయ కుంటల ఏర్పాటుకు సంబంధించి అధిక సంఖ్యలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఉద్యానవన, ఆయిల్‌పామ్ రైతులను ప్రోత్సహించి వ్యవసాయ కుంటలు, బోరుబావుల పునరుద్ధరణ పనులను విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పైకప్పుల వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి, ప్రతి గ్రామ సమాఖ్య భవనానికి సామూహిక పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేసి వెంటనే ఆమోదానికి పంపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను తక్షణమే సమర్పించి, పర్యవేక్షణ వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానాల కోసం వేచి ఉండకుండా అవసరమైన తీర్మానాలను వెంటనే తీసుకుని పనుల ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అన్ని పథకాలలో సమాచార ఖచ్చితత్వం, సకాలంలో ప్రతిపాదనల సమర్పణ, చెల్లింపుల పూర్తి, క్షేత్రస్థాయి ధృవీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, లక్ష్యాల సాధన వరకు ప్రతిరోజూ పర్యవేక్షణతో పాటు క్లస్టర్‌వారీగా సమీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ పీడీ సన్యాసయ్య, జడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, ఈజీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.