ఘనంగా హాతిరాం బాలాజీ జయంతి వేడుకలు

ఘనంగా హాతిరాం బాలాజీ జయంతి వేడుకలు

  విశ్వంభర, అక్కన్నపేట:  అక్కన్నపేట మండలం పంతులు తండాలో హాతిరాం బాలాజీ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండా ప్రజలు, గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని తమ సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భోగ్ బండార్ ఏర్పాటు చేసి నైవేద్యాలు సమర్పించారు. గిరిజన మహిళలు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకుని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ బంజారా కలియుగ దైవం హతిరాం బాలాజీ అని ఇక్కడ పుణ్యక్షేత్రం కట్టడం బంజారాలకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని అన్నారు.అందరూ కలిసికట్టుగా సహాయ సహకారాలు అందించి ఈ పుణ్యక్షేత్రానికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో . జామ్లా నాయక్. లాలూ నాయక్. స్వామి నాయక్. కొముర నాయక్.. బాలు నాయక్ , గిరిజన కుల పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/grand-celebration-of-hatiram-balajis-birth-anniversary/article-19288

Tags: