ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
: ఎంపీడీవో జలంధర్ రెడ్డి
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లారేపాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జి. జలంధర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, ఫైనల్ దశలో ఉన్న 13 ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లు, మేస్త్రీలను ఆదేశిస్తూ, నిర్లక్ష్యం లేదా అవకతవకలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో హాజరు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. గ్రామంలో సోక్‌పిట్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఎస్.కె. రసూల్, హౌసింగ్ ఏఈ టి. అశోక్ తదితరులు పాల్గొన్నారు.