వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలపై  అప్రమత్తంగా ఉండాలి

  •  విద్యుత్ ఏఈ    ఎన్.సింధు

విశ్వంభర, ఇనుగుర్తి: వర్షాకాలంలో జరిగే విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ ఉత్తర మండలం సెక్షన్, సబ్ డివిజన్ నెల్లికుదురు ఆధ్వర్యంలో ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో మంగళవారం ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ ఎన్.సింధు ప్రజలను ఉద్దేశించి వర్షాల కాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పిస్తూ జి ఐ వైర్లపై దండాలతరహాలో బట్టలు ఆరవేయ వద్దని,తడిచేతులతో స్విచ్లు ఆన్ ఆఫ్ చేయవద్దని, వ్యవసాయ విద్యుత్ మోటర్లు, స్టార్టర్లకు ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో ఐరన్,ఇతర స్తంభాలను తాకవద్దన్నారు.ఇన్సులేషన్ ఫెయిల్ అయిన వైర్లను తొలగించి నాణ్యమైన సర్వీస్ వైర్లను ఉపయోగించాలని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏవైనా సమస్యలు ఉంటే విద్యుత్ శాఖ సిబ్బందికి తెలుపాలని సూచించారు. రైతులు స్వయంగా డి టి ఆర్ ఏపీ స్పీచ్ లను ఆపరేట్ చేసి మరమ్మతు పనులు చేయవద్దన్నారు. ప్రమాదాలు నివారించేందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.సమస్యలు ఏవైనా ఉంటే 1912 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని గ్రామస్థులకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య, గ్రామస్తులు తాళ్ల పెళ్లి శ్రీకాంత్,రాజు, చెడుపాక వెంకన్న, ఎస్ ఎల్ ఐ రమణయ్య లైన్మెన్లు మంకీలాల్ కనకాచారి ఎస్ వెంకన్న అసిస్టెంట్ లైన్మెన్ ముస్తఫా,వి.డబ్ల్యూ మునిగంటి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/be-careful-about-electrical-hazards-during-monsoons/article-19330

Tags: