ప్రభుత్వ సేవల నాణ్యత పెంపే లక్ష్యం: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
- కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో విస్తృత పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు
విశ్వంభర, కమాన్‌పూర్: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో పర్యటించిన ఆయన గుండారం ఎంపీపీ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతన తహసీల్దార్ కార్యాలయం, ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ, పెంచికల్‌పేట్ సింగరేణి భూములు, రామగిరి తహసీల్దార్ కార్యాలయం, మేడిపల్లి ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని పరిశీలించారు. గుండారం ఎంపీపీ పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమాన్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయంలో మిగిలిన పనులను పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి కొత్త భవనం నుంచే సేవలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పెంచికల్‌పేట్‌లోని సింగరేణి భూముల వివాదాల పరిష్కారానికి సమగ్ర భూ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి పనితీరును మెరుగుపరచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణ, స్టాప్ డయేరియా, ఎన్‌సీడీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. రామగిరిలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని గడువులోగా పూర్తి చేయాలని, మేడిపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కమాన్‌పూర్ తహసీల్దార్ వాసంతి, రామగిరి తహసీల్దార్ సుమన్, ఎంపీడీఓ శైలజారాణి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.