గడువులోగా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
- ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్
విశ్వంభర, ఇనుగుర్తి: నిర్దేశిత గడువులోగా ఓటరు నమోదు డిజిటలైజేషన్ 100 శాతం పూర్తి చేయాలని ప్రొబె షనరీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ నితీష్ కుమార్ బి ఎల్ వో లు,సహాయకులు, బూత్ మండల స్థాయి పర్యవేక్షకులకు సూచించారు.మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు మండల పరిధిలో నిర్వహిస్తున్న 2026 ప్రత్యేక ఓటర్ల నమోదు సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని డిప్యూటీ కలెక్టర్ స్థానిక తహసిల్దార్ సుంకరి శ్రీనివాస్ తో కలిసి మంగళవారం విసిట్ చేశారు.ఇనుగుర్తి,చిన్న నాగారం, కోమటిపల్లి,చిన్న ముప్పారం రెవిన్యూ గ్రామాల పోలింగ్ స్టేషన్లను వారు సందర్శించారు.ఓటర్ నమోదు దరఖాస్తుల డిజిటలైజేషన్ గురించి సంబంధిత బిఎల్ఓ లను అడిగి తెలుసుకున్నారు. 23 పీఎస్ లకు సంబంధించిన నమోదు ప్రగతిపై ఆరా తీశారు.అనంతరం సంబంధిత అధికారులను ఉద్దేశించి ఆయన పలు సూచనలు చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో బూతు స్థాయి అధికారులు సహాయకుల పాత్ర కీలకమన్నారు. ఎస్ ఐ ఆర్ ఎలక్షన్ సిబ్బంది,అధికారులతో పాటు రాజకీయ ఆపక్షాలు ప్రక్రియ విజయవంతంలో చురుగ్గా భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేందర్, ఆయా గ్రామాల బిఎల్వోలు పర్యవేక్షకులు పంచాయతీ కార్యదర్శులు జిపివో పాల్గొన్నారు.