నీట్ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి: పిడిఎస్యు

  • ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్

విశ్వంభర, మహబూబాబాద్ : నీట్ పరీక్ష రద్దు వ్యవహారంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర నాయకులు బానోత్ దేవేందర్ విమర్శించారు. పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, ప్రశ్నాపత్రం లీక్ ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఎన్నో నెలల పాటు శ్రమించి, భారీ మొత్తంలో ఖర్చు చేసి సిద్ధమయ్యారని తెలిపారు. అలాంటి పరీక్షను ప్రశ్నాపత్రం లీక్ కారణంగా రద్దు చేయడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ, ఆ మరణాలకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు గత రెండు నెలలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనలు, విద్యార్థుల నిరసనలను అణచివేసేందుకు పోలీసులు లాఠీచార్జి, భాష్పవాయు గోళాల ప్రయోగం చేయడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని అన్నారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు చేయడం కూడా ఖండనీయమన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించిన బానోత్ దేవేందర్.. ఇప్పటికైనా కేంద్రం తన మొండివైఖరిని వీడి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే, నీట్ పరీక్ష రద్దు కారణంగా మరణించారని పేర్కొన్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/with-cancellation-of-neet-future-of-students-is-in-darkness/article-19286

Tags: