ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్షను రద్దుచేసి 20 మంది విద్యార్థులు మరణానికి కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుండి భర్త రఫ్ చేయాలని జిల్లా కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు హలవత్ లింగయ్య అధ్యక్షతన నిర్వహించారు . ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందనే పేరుతో పరీక్ష రద్దు చేయడం ద్వారా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీ తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని హెచ్చరించారు . అంతేకాకుండా లక్షల రూపాయలు ఖర్చుపెట్టి సంవత్సరాలు తరబడి కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులు దాన్ని రద్దు చేయడం వలన తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని, నీటి పరీక్ష రద్దు కారణంగా ఇప్పటివరకు 20 మంది మరణించారని, దీనికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గత గత రెండు నెలలుగా కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి యువజనులు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, ఢిల్లీ జంతర్మంతర్ వద్ద సామాజిక వేత్త సోనం వాంగ్ చుక్ 20 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష సాగించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎలాంటి చర్చలు లేకుండానే ఆ దీక్షను భగ్నం చేశారని ఆయన అన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిన్న ఢిల్లీలో పార్లమెంటు వరకు ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థి,యువకులపై పాశవికంగా లాఠీచార్జి చేసి, భాష్ప వాయు గోళాలు ప్రయోగించి అనేక మందిని గాయపరిచారని, వందలాదిమందిపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు . బిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్తేను అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కూడా చెప్పడం లేదని ఆయన అన్నారు. జరిగిన తప్పిదానికి బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధితులపైనే నిందలు వేస్తూ ధమన కాండకు పూనుకుంటున్నదని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఐలయ్య హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర , ప్రభుత్వం బేసిజానికి పోకుండా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుండి తొలగించాలని, నీట్ రద్దు కారణంగా మరణించిన 20 మంది కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున సహాయం అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . అనంతరం లేనట్లయితే దేశవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమాలు వస్తాయని ఆయన అన్నారు . ఈ ధర్నాలో పార్టీ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు మోకాళ్ళ మురళీకృష్ణలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ, ప్రజాసంఘాల నాయకులు నేతకాని రాకేష్, రామగిరి బిక్షం, ఏపూరి వీరభద్రం, సామ పాపయ్య, పర్వత కోటేష్, మున్విత, భూక్యా రాము, కుక్కమూడి యాకయ్య, పట్టాభి మల్లేశం, సురేష్, లింగన్న,కొదుమూరి నాగేశ్వరరావు,సజ్జ జలంధర్ తదితరులు పాల్గొన్నారు .