అంబేద్కర్ అభయహస్తం అమలు చేయాలి: మైస ఉపేందర్ మాదిగ
విశ్వంభర, తార్నాక : చేవెళ్ల డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని వెంటనే అమలు చేసి, ఎస్సీ–ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఎస్సీ–ఎస్టీల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించి అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. హామీలు అమలయ్యే వరకు దళితుల పక్షాన ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ అభయహస్తం అమలు, ఎస్సీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం 20 శాతానికి పెంచడం, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, తెలంగాణ ఉద్యమకారులకు స్థలాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించి ఛైర్మన్ల నియామకం, మాదిగ జర్నలిస్టులకు స్థలాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకే ప్రభాకర్ మాదిగ, ఎలగందుల గణేష్ మాదిగ, ప్రతి మాదిగ సురేష్, ప్రశాంత్, చింటూ తదితరులు పాల్గొన్నారు.