సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ సిటిజన్ వాలంటీర్ కమిటీ సమావేశం
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ సిటిజన్ వాలంటీర్ కమిటీ సభ్యులతో పట్టణ ఇన్స్పెక్టర్ ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, వృద్ధుల భద్రత, మరియు స్థానిక సమస్యలపై కమిటీ సభ్యులతో ఇన్స్పెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు.ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడంలో సీనియర్ సిటిజన్ల అనుభవం, సలహాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. పట్టణంలో వృద్ధులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వారికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కాలనీల్లో అపరిచిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం వాలంటీర్లుగా ముందుకొచ్చిన సీనియర్ సిటిజన్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ వాలంటీర్ కమిటీ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.