తెలంగాణ ఉద్యమ ఫొటో జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి

విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సేవలందించిన ఫొటో జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణతో కలిసి తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు జి. భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాదులో  ప్రభుత్వ సలహాదారు తెలంగాణ ఉద్యమకారుల కేకే కమిటీ చైర్మన్ కేశవరావుకు వినతి పత్రం అందజేసి తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు దృశ్యరూపంలో అందించిన ఫొటో జర్నలిస్టులు ఉద్యమ సమయంలో లాఠీచార్జీలు, రాళ్లదాడులు, టియర్ గ్యాస్, అరెస్టులు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూనే తమ విధులను సమర్థంగా నిర్వహించి ఉద్యమానికి దృశ్య చరిత్రను సృష్టించారని తెలిపారు. గతంలో ఉద్యమంలో కెమెరాలు ధ్వంసమైన ఫొటో జర్నలిస్టులకు కొత్త కెమెరాలు అందజేయడంతో పాటు జిల్లా అక్రిడిటేషన్ కమిటీల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించినట్లు గుర్తు చేశారు. అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమ ఫొటో జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు, పింఛన్, గృహాలు మంజూరు చేసి వారి సేవలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, తెంజు ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, టీపిజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వేశ్వర్ రెడ్డి, రాఘవేందర్,టీపిజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్. తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/photojournalists-of-the-telangana-movement-should-be-given-special-recognition/article-19292

Tags: