తెలంగాణ రాష్ట్ర ముద్రపై వివాదం.. చార్మినార్ దగ్గర కేటీఆర్ నిరసన

తెలంగాణ రాష్ట్ర ముద్రపై వివాదం.. చార్మినార్ దగ్గర కేటీఆర్ నిరసన

తెలంగాణ రాజముద్రలో చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు వినిపించకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. 

 

Read More గుంతలు పడిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి

చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం తెలంగాణ చరిత్రను అవమానించడేమే అవుతుందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతిపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. అదృష్టంతో రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారని సెటైర్లు వేశారు. లేనివాటిని రాజముద్రలో చేర్చడంలో తప్పులేదని.. కానీ, ఉన్నవాటిని తొలగించడం మూర్ఖత్వమని అన్నారు. 

 

Read More గుంతలు పడిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి

 

Read More గుంతలు పడిన రోడ్లను మరమ్మత్తులు చేయాలి

లోగోలో చార్మినార్ తొలగిండమంటే హైదరాబాద్ మహానగరాన్ని అవమానించడమేనని.. ఇక తెలంగాణ చరిత్రకు ఆనవాలుగా ఉన్న కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. లోగో నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించవచ్చు కానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై నెలకొన్న వివాదంలో భాగంగా కేటీఆర్ చార్మినార్ దగ్గర నిరసన తెలిపారు.