అనంతపురం ఆర్యవైశ్య సంఘ సమావేశంలో ఉద్రిక్తత.. సభ్యుల మధ్య వర్గ విభేదాలు

  • అనంతపురం ఆర్యవైశ్య హాస్టల్‌లో బైలా రూపకల్పనపై సమావేశం.
  • ఆర్యవైశ్య విద్యార్థుల ప్రయోజనాల కోసం బైలా ఉండాలని సభ్యుల డిమాండ్.

Anantapur News: అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో ఉన్న ఆర్యవైశ్య హాస్టల్‌లో బైలా రూపకల్పనపై ఆర్యవైశ్య సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశం సందర్భంగా సభ్యత్వం లేని వ్యక్తులు బయటకు వెళ్లాలని శబరి అనే సభ్యుడు కోరడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని సమావేశంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.

ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ, ఆర్యవైశ్య విద్యార్థుల సంక్షేమం, హాస్టల్ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా బైలాను రూపొందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచని బైలాను తాము ఆమోదించబోమని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య హాస్టల్ పూర్తిగా ఆర్యవైశ్య విద్యార్థులకే ఉపయోగపడేలా నిబంధనలు రూపొందించాలని కోరారు.

Read More అనంతపురంలో తల్లికి వందనం కార్యక్రమం.. ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం: ఎమ్మెల్యే దగ్గుపాటి

హాస్టల్ అభివృద్ధి, నిర్వహణలో పారదర్శకత ఉండేలా బైలాను రూపొందించాలని, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులు సూచించారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

అనంతపురం ఆర్యవైశ్య సంఘ సమావేశంలో ఉద్రిక్తత.. సభ్యుల మధ్య వర్గ విభేదాలు

Anantapur News: అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో ఉన్న ఆర్యవైశ్య హాస్టల్‌లో బైలా రూపకల్పనపై ఆర్యవైశ్య సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశం సందర్భంగా సభ్యత్వం లేని వ్యక్తులు బయటకు వెళ్లాలని శబరి అనే సభ్యుడు కోరడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని సమావేశంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.

ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ, ఆర్యవైశ్య విద్యార్థుల సంక్షేమం, హాస్టల్ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా బైలాను రూపొందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచని బైలాను తాము ఆమోదించబోమని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య హాస్టల్ పూర్తిగా ఆర్యవైశ్య విద్యార్థులకే ఉపయోగపడేలా నిబంధనలు రూపొందించాలని కోరారు.

హాస్టల్ అభివృద్ధి, నిర్వహణలో పారదర్శకత ఉండేలా బైలాను రూపొందించాలని, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులు సూచించారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/anantapur-arya-vaishya-sangha-meeting-tension-between-members-of-sectarian/article-19782

Tags: