అంకుసాపూర్, ఇంద్రనగర్‌లో సొంత ఖర్చుతో కొత్త మోటారు ఏర్పాటు చేసిన 3వ వార్డ్ మెంబర్ సుకన్య మధుసూదన్ రెడ్డి
On
విశ్వంభర, రాజన్న సిరిసిల్ల జిల్లా:- తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని అంకుసాపూర్ గ్రామం మూడో వార్డ్ ఇంద్రనగర్‌లో వార్డ్ మెంబెర్ రోoడ్ల సుకన్య మధుసూదన్ రెడ్డి దంపతులు తమ సొంత ఖర్చుతో కొత్త మోటారును ఏర్పాటు చేశారు. ఈ మోటారును వారి మామగారు స్వర్గీయ రోడ్ల బాల్ రెడ్డి జ్ఞాపకార్థంగా బోరు వద్ద ఆయన పేరుతో నామకరణం చేశారు. ఈ సందర్భంగా వార్డ్ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ అంచ శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ జగ్గని రాజేశం,సవనపల్లి బాలయ్య, క్యారం పరుశురాముడు, ముత్తయ్య, రేగుల శ్రీనివాస్, తుమ్మల కనకయ్య, బొనుగని జమున హాజరై శాలువాతో సత్కరించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



