జూనియర్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
విశ్వంభర, రామన్నపేట:12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఆదివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో యోగా గురువు బొడ్డుపెళ్లి సైదులు, బిజెపి నకిరేకల్ ఇన్చార్జి నకిరేకంటి మొగులయ్య రామన్నపేట మండల సర్పంచ్ గరిక సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ, నిత్య జీవితంలో మనమందరము యోగాను ఒక భాగంగా సాధన చేసుకుంటూ పోతే చాలా రకాల వ్యాధులని నివారించుకోవచ్చని, మానసిక ప్రశాంతతని కూడా పొందవచ్చని అన్నారు. యోగా ద్వారా పిల్లలలో మానసిక వికాసం అధిక ఒత్తిడి నుంచి విముక్తి వస్తుందని, రానున్న రోజులలో పిల్లలకి యోగా ఒక క్రీడగా పోటీలలో పాల్గొనడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఎందరో యోగులు ఋషులు సాధించిన ఈ యోగా ప్రపంచ మానవాళికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ నెంబర్ వనం అంజయ్య, మండల ఇంచార్జ్ కొరివి శంకర్, మిరియాల మల్లేష్, దావూరి వెంకటేష్, కట్ట యాదయ్య, మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు బట్టే రమేష్, నరసింహ, పొట్టబత్తుల వెంకన్న, గోపగోని అశోక్, ఏనూతుల సురేష్, మేడి పరశురాం, చిన్నపాక స్వామి, వీరమల్ల గణేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.