పశు వైద్యం అందించే 1962 నెంబర్ వాహనాలు పెంచాలి  

పశు వైద్యం అందించే 1962 నెంబర్ వాహనాలు పెంచాలి  

విశ్వంభర, చండూర్ :  తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు గాను,  నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున 1962 నెంబర్ గల పశువైద్య వాహనాలు 119 మాత్రమే ఈ రాష్ట్రంలో వినియోగంలో ఉన్నాయని, దీంతో పశువులకు పూర్తిస్థాయి వైద్యం అందడం లేదని బిజెపి కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో గల చండూరు మండలంలోని తాస్కాన్ గూడెం గ్రామంలో  ఆయన ఆదివారం  ఆ గ్రామ రైతులతో కలిసి  మీడియాతో మాట్లాడుతూ మనుషులకు అత్యవసర సమయంలో  వైద్య సదుపాయం కోసం ఈ రాష్ట్రంలో 108 నెంబర్ గల  వాహనాలు మండలానికి ఒకటి చోప్పున ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇదే మాదిరిగా  పశువులకు సైతం 1962 నెంబర్ గల వాహనాలను మండలానికి ఒకటి చొప్పున పెంచి పశువులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాన్ని  కల్పించాలని  ఆయన ఈ సందర్భంగా కోరారు.

Tags: