108 వాహనంలో గర్భిణీ ప్రసవం...
On
పురుడుపోసిన 108 సిబ్బంది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - జూలూరుపాడు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన దొడ్డ మానస అనే నిండు గర్భిణీ స్త్రీ కి అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో విషయం తెలుసుకున్న ఆశ వర్కర్ విజయ 108 కి ఫోన్ చెయ్యగా జూలూరుపాడు 108 సిబ్బంది హుటాహుటిన వెళ్లి కొత్తగూడెం(రామవరం)మత శిశువు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మానస కు నొప్పులు ఎక్కువ కావడంత 108 వాహనంలో ఆశ వర్కర్ విజయ సహాయంతో EMT రవి పురుడుపోశాడు(డెలివరీ) చేసాడు,మానస పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు సకాలంలో స్పందించి పురుడు పోసిన 108 సిబ్బంది EMT రవి, ఆశ వర్కర్ విజయ,పైలెట్ తడికమల్ల శ్రీను కు మానస కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు..