స్నేహితుడికి మిత్రుల చేయూత
విశ్వంభర, నెల్లికుదురు: నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన ముంజంపల్లి సంజయ్ మాతృమూర్తి యాకమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్ను మూసింది. సమాచారం తెలుసుకున్న ఆయన బాల్య స్నేహితులు నక్క హరీష్, కాటం రాజశేఖర్,రాజు తదితరుల తో పాటు గ్రామానికి చెందిన కూరపాటి ఈశ్వర ప్రసాద్, వార్డు సభ్యులు కాటమల వెంకటేష్ శనివారం బాదిత కుటుంబాన్ని సందర్శించి స్వర్గీయ యాకమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిత్రుడు సంజయ్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్న వయసులోనే జన్మనిచ్చిన తల్లిని కోల్పోవడం బాదా కరమని విచారం వ్యక్తం చేశారు. ఆపదలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని స్నేహితునికి ధైర్య వచనాలు చెప్పారు. మిత్రులు రూ.15,000, గ్రామవాసి ఈశ్వర ప్రసాద్ రు.5,000, వార్డు సభ్యులు వెంకటేష్ 25 కిలోల బియ్యం అందజేసి అండగా ఉంటామని చేయూతనిచ్చారు.