ఘనంగా మహాకవి దాశరథి జయంతి వేడుకలు
విశ్వంభర, రవీంద్రభారతి : తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకలు బుధవారం హైదరాబాదు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాషా–సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అందెశ్రీ రచించిన "సాహిత్యం పాటల పూదోట – అందెల సవ్వడి" గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. బాలాచారి మాట్లాడుతూ, దాశరథి సాహిత్యం తెలంగాణ ఆత్మను ప్రతిబింబించడంతో పాటు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, సమసమాజ నిర్మాణం, మానవతా విలువల పరిరక్షణకు దాశరథి రచనలు మార్గదర్శకమని పేర్కొన్నారు. దాశరథి కుమార్తె ఇందిరా మాట్లాడుతూ, మహాకవి సాహిత్య వారసత్వాన్ని యువతకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో: డా. బాలాచారి, బడే సాబ్, అమ్మంగి వేణుగోపాల్, గంటా మనోహర్ రెడ్డి, సంఘన భట్ల నరసయ్య, రామకృష్ణ చంద్రమౌళి, కవులు, రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభి మానులు పాల్గొన్నారు.