బి.కె.పల్లిలో ముదిరాజ్ కాలనీదారికి 'భూ'వితరణ

  • శ్రీనివాస రావును అభినందించిన సర్పంచి యాకాంతం గౌడ్

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి శ్రీనివాసరావు అదే గ్రామంలోని ముదిరాజుల కాలనీ వాసులకు దారి కోసం తన సొంత భూమిని దానంగా ఇచ్చాడు. సర్వేనెం.327/2/2 లోని మూడు గుంటల భూమిని నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ సమక్షంలో సంబంధిత భూమికి చెందిన పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచి చిర్ర యాకాంతం గౌడ్ శ్రీనివాసరావు ఉదార స్వభావంతో బాట కోసం తన భూమిని దాన పూర్వకంగా ఇవ్వడం అభినందనీయమని అభినందించారు. దాత శ్రీనివాసరావు మాట్లాడుతూ ముదిరాజ్ కాలనీ వాసుల కు సరైన దారి లేకపోవడంతో వారి అభ్యర్థన మేరకు తన భూమిని ఇచ్చినట్లు తెలిపారు.ముదిరాజులతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య, పంచాయతీ కార్యదర్శి ఎర్ర రవి, వార్డు సభ్యులు బొల్లు మురళీకృష్ణ యాదవ్, గ్రామస్తులు నల్ల మాస రామచంద్రు నోముల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/allotment-of-land-to-mudiraj-colony-in-bkpally/article-19704

Tags: