ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. -
- బొగ్గారపు వరుణ్ గుప్త, కొత్తపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
On
విశ్వంభర, ఎల్బీనగర్ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షిం చుకోవాలని కొత్తపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొగ్గారపు వరుణ్ గుప్తా పిలుపునిచ్చారు. ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సర్ దరఖాస్తుల సమర్పణ గడువును 2026 ఆగస్టు 3 వరకు పొడిగించి నందున, ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటర్లు సర్ దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి, అవసరమైన ధృవీకరణ పత్రాలను జత చేసి, సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ కు వెంటనే అందజేయాలని కోరారు. తానూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి సర్ ఫామ్ ను నింపి అధికారులకు అందజేశానని తెలిపారు. అలాగే, ఓటరు జాబితాలో తమ పేరు సక్రమంగా నమోదైందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. “ఒక్క ఓటు కూడా కోల్పోవద్దు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు. దానిని పరిరక్షించుకో వడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన బాధ్యత" అని బొగ్గారపు వరుణ్ గుప్తా పేర్కొన్నారు.
🕒 25 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/every-voter-must-participate-in-the-special-electoral-roll-amendment/article-19690