ఎంపి వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు 

ఎంపి వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు 

విశ్వంభర, నెల్లికుదురు: రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని నెల్లికుదురు మండలానికి చెందిన బ్లాక్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు  అతని నివాసంలో శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించి శుభాభినందనలు తెలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి, గొల్లెపల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హెచ్చు వెంకటేశ్వర్లు, మండల నేత ఆకుతోట సతీష్, వివిధ గ్రామాల అధ్యక్షులు పిట్టల మురళి, అనిల్, ఇసంపల్లి వెంకటేష్, నాయకులు మట్టవెంకట్రెడ్డి, పెరుమాండ్ల జగన్, సతీష్, మధు, గోవర్ధన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: