గిర్ని తండాలో ఘనంగా ఈసీసీ డే
On
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం స్టేషన్ మున్సిపాలిటీ పరిధిలో గిర్ని తండా అంగన్వాడి కేంద్రంలో ఈసీసీ డే ఘనంగా అంగన్వాడీ టీచర్స్ రమాదేవి, కవిత, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అంగన్వాడి సూపర్వైజర్ విజయ, వీఆర్వో రాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లల ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమమని, అంగన్వాడి సెంటర్ ద్వారా లభించే పౌష్టికాహారం పిల్లలకు ఎంతో బలమైనదని అన్నారు. ఆకుకూరలు పాలు, గుడ్లు, మాంసం కృతులు బాగా ఉంటాయని ప్రతిరోజు అంగన్వాడి సెంటర్ ద్వారా లభించే పౌష్టికాహారం తీసుకుంటే పిల్లలు దృఢంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, కిషోర్ బాలికలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తండావాసులు, ఆయాలు వెంకటలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.



