పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ ఉదారత
On
క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆర్ధిక సాయం
విశ్వంభర, భూధన్ పోచంపల్లి : మున్సిపల్ పరిధిలోని బసవలింగేశ్వర కాలనీ లో క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్నటువంటి కర్నాటి నర్సింహస్వామికు పోచంపల్లి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ ఆర్థిక సహాయాన్ని అందజేసి పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నర్సింహస్వామికి ధైర్యం చెప్పి , ఎలాంటి దిగులు చెందకుండా ఉండాలని, త్వరితగతిన కోలుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో TR యువసేన, టై & డై ఉపాధ్యక్షులు కుడికాల రామనర్సింహ, ఏకెఎల్బి అధ్యక్షులు గుండు శ్రీరాములు, గుండు ఉప్పలయ్య, అంకం పాండు, బోగ నర్సింహ, వలందాస్ ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.