చేనేత ఐక్య వేదిక  చీఫ్ అడ్వైజర్ గా పసుల భాగ్యలక్ష్మి నియామకం 

చేనేత ఐక్య వేదిక  చీఫ్ అడ్వైజర్ గా పసుల భాగ్యలక్ష్మి నియామకం 

విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ చేనేత ఐక్యవేదిక మహిళా విభాగం చీఫ్ అడ్వైజర్ గా పసుల భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ చేతుల మీదుగా ఆమె తుర్క యంజాల్  లోని రాష్ట్ర కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత ఐక్య వేదిక మహిళా విభాగం ద్వారా నాకు చీఫ్ అడ్వైజర్ గా పదవి బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషముగా ఉందని అన్నారు. ఇంతటి భాధ్యతను నాపై నమ్మకం ఉంచి అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కు ధన్యవాదాలు తెలిపారు. చేనేత ఐక్య వేదిక మహిళా విభాగం ద్వారా మహిళల అభున్నతికై కృషి చేస్తానని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ప్రాధాన్యత సంతరించుకునేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. ఆర్ధిక , రాజకీయ , సామజిక రంగాల్లో మహిళలు ముందుండేలా కృషి చేస్తానని అన్నారు. నా నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 

Tags: