అంబర్ నగర్ లో  పద్మశాలి మహాసభల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

 అంబర్ నగర్ లో  పద్మశాలి మహాసభల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ఆవిష్కరించిన  గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత

విశ్వంభర, హైదరాబాద్ : మార్చి 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయే అఖిల భారత,  తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘాల మహాసభల ఆహ్వాన పత్రికలను అంబర్ నగర్ మార్కండేయ స్వామి దేవాలయం లో  గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. దేవాలయ అధ్యక్షులు స్వర్గం బాబురావు ఆహ్వానం మేరకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ముఖ్యఅతిథిలుగా ఆయన  హాజరై  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పద్మశాలి మహిళా అధ్యక్షురాలు గుంటక రూప, అయిటిపాముల స్వప్న ,సికింద్రాబాద్ అధ్యక్షులు పూల మారుతి,  అంబర్ నగర్ లోని   పద్మశాలి నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags: