ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు

  • వామపక్ష ఐక్యతకు యంసిపిఐ(యు) పిలుపు

విశ్వంభర, చండీగఢ్‌ : ప్రైవేటీకరణ, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలు అవసరం అని యంసిపిఐ(యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ తెలిపారు. జూన్ 1 నుంచి 7 వరకు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు వారం రోజులపాటు ప్రజా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మే 22 నుంచి 25 వరకు చండీగఢ్‌లోని కిసాన్ భవన్‌లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశం కుల్దీప్ సింగ్ అధ్యక్షతన జరిగింది. యుద్ధాలు, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి, కమ్యూనిస్టు ఐక్యత వాది ప్రొఫెసర్ విజయ్ సింగ్ స్మరణార్థం సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం మాట్లాడిన ప్రధాన కార్యదర్శి, గత ఎనిమిదేళ్లుగా విడిపోయి ఉన్న వామపక్ష శక్తులు ఫిబ్రవరిలో జోధ్‌పూర్‌లో నిర్వహించిన యూనిటీ జాతీయ కన్వెన్షన్ అనంతరం ఈ సమావేశం కీలకమని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీ, ప్రజా సంఘాల ఏకీకరణకు జూన్–జూలైలో చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం పెరిగిందని విమర్శించారు. యుద్ధ పరిస్థితులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరల ఎగసిపడటం వల్ల పేదరికం పెరుగుతోందన్నారు. లేబర్ కోడ్‌ల రద్దు, 2005 ఉపాధి హామీ పథకం యథాతథ అమలు, కనీస వేతనం రూ.26,000 నిర్ణయం, మహిళా రిజర్వేషన్ అమలు, రాష్ట్ర హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్లపై ఉద్యమాలు చేపట్టాలని కేంద్ర కమిటీ తీర్మానించింది. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు గాదగోని రవి (రాష్ట్ర కార్యదర్శి), వల్లెపు ఉపేందర్ రెడ్డి, నర్ల చంద్రశేఖర్, మోర్తాల చందర్ రావు, గోనె కుమారస్వామి, కుంభం సుకన్య, వరికుప్పల వెంకన్న, వస్కుల మట్టయ్య, సింగతి సాంబయ్య, బాషకార్ల బాబు, కాటం నాగభూషణం, తూమాటి శివయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/agitations-against-anti-democratic-policies/article-15848

Tags: