రేపు ఆఫ్టనిస్తాన్ తో మ్యాచ్.. కలిసిరాని పిచ్..
టీ20 వరల్డ్ కప్ లో అదరగొడుతున్న టీమ్ ఇండియా.. ఇప్పటికే లీగ్ దశలోని అన్ని మ్యాచ్ లలోనూ గెలిచింది. దాంతో ఇప్పుడు సూపర్-8 మ్యాచ్ లలోకి అడుగు పెట్టింది. అయితే సూపర్-8 మ్యాచ్ లో కోసం ఇప్పటికే బార్బడోస్ చేరుకుంది టీమిండియా టీమ్. ఇక సూపర్-8 లోమొదటి మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ తో జూన్ 20న జరగనుంది.
బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇక్కడే మన టీమ్ కు పెద్ద బ్యాడ్ సెంటిమెంట్ వస్తోంది. ఎదుకంటే ఇప్పటి వరకు ఈ పిచ్ మన ఇండియాకు చాలా దురదృష్టకరంగాఉంది. ఈ పిచ్ లో ఇప్పటి వరకు మన టీమ్ ఇండియా ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేదు.
అందుకే ఇప్పుడు ఇండియా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఇండియా గతంలో 2 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అయితే ఆ రెండింటిలోనూ ఓడిపోయింది. 2010 మే నెలలోనే ఆ మ్యాచ్ లు జరిగాయి. అంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో మన జట్టు ఆడబోతోంది. కానీ ఈ సారి కూడా బ్యాడ్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందా లేదంటే సరికొత్త రికార్డు సృష్టిస్తుందా అనేదాని కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.