పోరాట యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్

పోరాట యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్

  •  ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి 

విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఎమ్మార్పియస్, ఎమ్మెస్పీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో  బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతిని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి  మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఏ ఒక్క వర్గానికో సొంతం కాదు. ఆయన అందరివాడు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు, హక్కులను తెలిపిన మహా నాయకుడు. వారికి రిజర్వేషన్లు, హక్కులు కల్పించడమే కాదు విధులను కూడా సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ఉండాలి ఎంత వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో రాజ్యాంగంలో క్లుప్తంగా వివరించారని అన్నారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికీ నిప్పు కణికలా జ్వలిస్తూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన అని అటువంటి మహోన్నత వ్యక్తి జయంతి రోజున ఆయనను స్మరించుకోవడం ప్రతి ప్రజాస్వామిక వాది భాధ్యత అని అన్నారు.ఆ మహనీయుడు కలలు గన్న సమ సమాజ స్థాపనకు యస్సి, యస్ టీ, బీసి, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు ఏకమై ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పియస్ మండల కన్వీనర్ మందుల లింగ స్వామి మాదిగ, బీసి బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం కురుమ, వివిధ సంఘాల పార్టీల నాయకులు గజరాజు కాశీనాథ్, దయ్యల కుమార స్వామి, ఎలాగందుల మహేష్, కొండపల్లి సాంబా, బోడ స్వామి ఎమ్మార్పియస్ సీనియర్ నాయకులు గట్టు రాములు మాదిగ,మండల నాయకులు కానుకుంట్ల మహేష్ మాదిగ, కానుకుంట్ల నవీన్ మాదిగ, గట్టు యాదగిరిమాదిగ,వరికుప్పల కృష్ణ,రాంపల్లి ప్రదీప్,పల్సం నర్సింహ్మా గౌడ్,చామకురా ఉపేందర్ ముదిరాజ్,పైళ్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: