ఎకానమీ క్లాస్‌లో ధోనీ ప్రయాణం.. చప్పట్లతో మార్మోగిన విమానం!

ఎకానమీ క్లాస్‌లో ధోనీ ప్రయాణం.. చప్పట్లతో మార్మోగిన విమానం!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్‌డమ్, ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంత స్టార్‌డమ్ ఉన్నా ధోనీ చాలా సింపుల్‌గా ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్‌డమ్, ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంత స్టార్‌డమ్ ఉన్నా ధోనీ చాలా సింపుల్‌గా ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాడు. ఎకానమీ క్లాస్‌లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ప్రయాణికులు ముందుగా ధోనిని ఎవరో అని పోల్చుకోలేకపోయారు. ఆ తర్వాత ధోనీ అని గుర్తించగానే చప్పట్లో మోతమోగించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి ధోనీ సింప్లిసిటీని చూసి నెటిజన్లు సలాం కొడుతున్నారు. నేడు జరిగిన లోక్‌సభ 6దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. రాంచీలో ఆయన ఓటేశారు.

 

 

 

Tags:

Related Posts