శ్రీశ్రీ కురుమూర్తి స్వామినీ దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
On
విశ్వంభర/ చిన్న చింతకుంట :-మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు దేవర కద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, ఆహ్వానం మేరకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీహరి, ఎ న్నం శ్రీనివాస్ రెడ్డి, మేఘ రెడ్డి లతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజలను దృష్టిలో ఉంచుకొని పాలనలను కొనసాగిస్తుందని ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని గడ్డం ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కురుమూర్తి రాయుణ్ణి వేడుకున్నట్టు స్పీకర్ తెలిపారు. ఈ పర్యటనలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఘన స్వాగతం పలికారు.



