సామజిక కార్యకర్త చేపూరి శంకర్‌కు ఘన సత్కారం
On
విశ్వంభర, హైదరాబాద్ :- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ తెలంగాణ బ్రాంచ్ కార్యాలయంలో మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్ ను ఘనంగా సత్కరించారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ, సీఈఓ శ్రీరాములు మాట్లాడుతూ నిరంతరం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచడం సమాజానికి ఆదర్శనీయం. ఆయన సేవా భావం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది అని అభినందించారు. చేపూరి శంకర్ మాట్లాడుతూ — “రక్తదానం అంటే ప్రాణదానం. ప్రతి యువకుడు ఈ సేవలో భాగం కావాలి. సమాజానికి నా వంతు సహాయం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యానగర్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ పిచ్చి రెడ్డి, రెడ్ క్రాస్ ప్రతినిధులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.
Read More అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్



