బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహన్...?
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవడంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నెల 9 ఎన్డీయే కూటమి అభ్యర్థిగా మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.
విశ్వంభర, ఢిల్లీ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవడంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నెల 9 ఎన్డీయే కూటమి అభ్యర్థిగా మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో దేశంలోని కీలక నేతలందరినీ ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను మార్చలనే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో 29 సీట్లను గెలిపించి క్లీన్ స్వీప్ చేసిన మాజీ సీఎం, మామాజీ గా మంచి పేరును సంపాదించుకున్న శివరాజ్ సింగ్ చౌహన్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క చౌహాన్‌కు కేంద్ర క్యాబినెట్‌లో అత్యంత కీలక మంత్రిగా తీసుకొనున్నారని కూడా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే.. రేపటి మీటింగ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే మరి.