కృష్ణవేణి స్కూల్లో  ముందస్తు గా. ఘనంగా సంక్రాంతి సంబరాలు , ముగ్గుల పోటీలు . ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .

కృష్ణవేణి స్కూల్లో  ముందస్తు గా. ఘనంగా సంక్రాంతి సంబరాలు , ముగ్గుల పోటీలు .   ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .

విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్లో  ముందస్తుగా  సంక్రాంతి సంబురాలు  అంగరంగ వైభావంగా జరిగాయి . ఇందులో భాగంగా సంక్రాంతి పండుగ  విశిష్టతను తెలియజేసే విద్యార్థుల ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది పండగ ముందు వచ్చేటువంటి పంటను మరియు పండుగ రోజులలో జరిపే అన్నింటినీ చాలా చక్కగా విద్యార్థులు  ప్రదర్శించీ ఆకట్టుకున్నాయి . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు  కేవలం చదువు  మాత్రమే  కాకుండా పండుగ విశిష్టతను దృశ్య రూపంలో విద్యార్థులందరికీ  ప్రదర్శన ప్రదర్శించి విద్యార్థులకు తెలియజేశారు . ఈరోజు ఇలా అందరము కలిసి పండగను జరుపుకోవడం, విద్యార్థులందరికీ తెలిసేలా చేయడం మన  అందరికీ చాలా సంతోషం గా ఉంది అని  కొనియాడారు .   అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు .ఇంకా ఈ కార్యక్రమంలో  స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ పురం ప్రీతి రెడ్డి , స్కూల్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ ,  స్కూల్  ఉపాధ్యాయ బృందం , మరియు విద్యార్థిని , విద్యార్థులు,  పాల్గొన్నారు .

Tags: