ఘనంగా గ్రాడ్యుయేషన్ డే 

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే 

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పోషణ పక్వాడా కార్యక్రమం, గ్రాడ్యుయెషన్ డే కార్యక్రమానికి ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాల పైబడిన పిల్లలకు, చిన్నారులకు ప్రిస్కూల్ సర్టిఫికెట్స్ సర్పంచ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ సూపర్ వైజర్ హేమలత, గర్భవతులు-బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మల్లేశం, అంగన్వాడీ టీచర్లు బి.సుజాత,ఎం.రేణుక, కే.మంజుల, టి.సావిత్రి, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.

Tags: