డి.టి.యు క్యాలెండర్ ఆవిష్కరణ

డి.టి.యు క్యాలెండర్ ఆవిష్కరణ

విశ్వంభర, గుండాల: గుండాల మండల కేంద్రంలోని స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ లో ధర్మ టీచర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ చేతుల మీదుగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా టి.పి.యు.ఎస్ గుండాల ప్రెసిడెంట్ రామకృష్ణ, డి.టి.యు గుండాల ప్రెసిడెంట్ లింగయ్య, పి.ఆర్.టి.యు మండల సెక్రటరీ జంపాల రాజు, గుండాల మండల సెక్రటరీ వెంకటేష్, పాచిల్ల పి.ఎస్ హెచ్‌ఎం వీరేశం పాల్గొన్నారు. అలాగే ఆత్మీయ అతిథులుగా మందుల కృష్ణయ్య, కురెళ్ళ రవి, సీఆర్పీ లింగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డి.టి.యు రాష్ట్ర కో-కన్వీనర్ ఎర్ర సుధాకర్ మాట్లాడుతూ, విద్యను ప్రజాస్వామీకరించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఫూలే, జాన్ డూయి, అంబేడ్కర్ తత్వాల ఆధారంగా భారతీయ విద్యా వ్యవస్థ సంస్కరించబడాలని తెలిపారు. ముఖ్యంగా పేద, నిరుపేద విద్యార్థులు ఎక్కువగా చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అన్ని సంఘాలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మ టీచర్స్ యూనియన్ కో-కన్వీనర్ చింత యాదగిరి, రామ నర్సయ్య, సుమతి, నవ్య, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Tags: