డకల యాదయ్య కు ఘనంగా నివాళులు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం సిరిగిరి పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తడకల యాదయ్య గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతూ మృతి చెందారు. తడకల యాదయ్య సిరిగిరి పురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మండల పార్టీ ఎస్సీ అధ్యక్షునిగా దళిత నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని ఒక మంచి నాయకున్ని కోల్పోయామని పలువురు నాయకులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆయన పార్థివ దేహానికి కాంగ్రెస్ నాయకులు గదగూటి జంగయ్య ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. సిరిగిరి పురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రకంటి వెంకటేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు చిట్టెమల్లేష్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం 10వ వార్డు ఇన్చార్జి కాకి మల్లేష్ ముదిరాజ్, నాయకులు గగనం ఆంజనేయులు, తదితరులు నివాళులర్పించారు.



