అట్టహాసంగా రేజోనేన్స్ ఇంటర్మీడియట్ కళాశాలల రెజో తరంగ్ ఫెస్ట్ -.
- చైర్మన్ లెక్కల రాజిరెడ్డి వెల్లడి
విశ్వంభర హనుమకొండ జిల్లా :-వరంగల్ ములుగు రోడ్డు లోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో వరంగల్ జిల్లాలో పేరు గాంచిన రాజస్థాన్ కోటాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలు రేజోనేన్స్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థుల రెజో తరంగ్ 2025 ఫెస్ట్ ను బుధవారం అట్టహాసంగా నిర్వహించినట్లు రేజోనేన్స్ కళాశాలల ఛైర్మెన్ లెక్కల రాజిరెడ్డి మీడియాకు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తులు బయటకు వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినిమా హీరో నందు,హీరోయిన్,యామిని భాస్కర్, పోలీసు డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి పార్టీలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో స్నేహభావం,సోదర భావం పెంపొందుతుందని తెలిపారు.అనంతరం అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.హీరో నందు,హీరోయిన్ విద్యార్థులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.



